శ్వేత వర్మ డబుల్ థమాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడేళ్ళ క్రితమే ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి నటనను కెరీర్ గా ఎంచుకుంది శ్వేత వర్మ. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి, 2016లో ‘లవ్ చేయాలా వద్దా’ మూవీలో కీలక పాత్రను పోషించింది. ఆ తర్వాత ‘మిఠాయి, సంజీవని, రాణి’ వంటి చిత్రాలలో నటించింది. ‘బియాండ్ బ్రేకప్’ వంటి వెబ్ సీరిస్ లోనూ నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్వేత వర్మకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓ డబుల్ ధమాకా దక్కబోతోంది.
శ్వేత వర్మ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఆగస్ట్ 6న రాబోతున్న ‘మ్యాడ్’ మూవీలో శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. అలానే ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో హీరో శ్రీనివాసరెడ్డి లవ్ ఇంట్రస్ట్ గానూ శ్వేత వర్మ కీ-రోల్ ప్లే చేసింది. ‘మ్యాడ్’లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే అఖిల పాత్రను ఆమె పోషించింది. లివ్ ఇన్ రిలేషన్ సాగించే అఖిల, అరవింద్ పాత్రలను శ్వేత వర్మ, రజిత్ రాఘవ్ పోషించారు. ట్రైలర్ లో ఈ జంట కనిపించిన తీరు చూస్తే కుర్రకారుని కిర్రెక్కించే సన్నివేశాలు ‘మ్యాడ్’లో బాగానే ఉన్నాయనిపిస్తోంది. ‘మ్యాడ్’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా జనం ముందుకు వస్తున్నాయి. ‘మ్యాడ్’ సినిమాలో అందాలు ఆరబోసిన శ్వేత వర్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
Also Read
- Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్... ఈరోజే 'హైవానియత్' టీజర్
- SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
- RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
- Chiru - Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్'కి పూనకాలే!
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!