ఆపదలో ఉన్నాం.. ఆదుకొండి అంటూ వస్తే తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి.. వైద్యం చేయించుకోవడం కష్టమైన వారికి భరోసా ఇచ్చారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ విషయానికి ఆయన భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు…