రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా…
ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు…