Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర 2 రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది.మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర మరియు శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.6.6 కోట్లు వసూలు చేయడం విశేషం. గతంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన మా ఊరి పొలిమేర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన అనిల్ విశ్వనాథ్ పొలిమేర 2 సినిమాను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో సత్యం రాజేష్,కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే గెటప్ శీను, బాలాదిత్య ముఖ్య పాత్రలు పోషించారు…
మా ఊరి పొలిమేర 2 మూవీ చేతబడుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తుందటంతో ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం మరో 50 స్క్రీన్లలో ఈ సినిమా ను ప్రదర్శిస్తున్నారు… దీంతో ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. కేవలం రెండో రోజే మా ఊరి పొలిమేర 2 మూవీ 70 వేల టికెట్లు అమ్ముడైనట్లు బుక్ మై షో వెల్లడించింది.మూడో రోజైన ఆదివారమే సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఈ సినిమా కథ ఆటో డ్రైవర్ కొమరయ్య, అతని సోదరుడు జంగయ్య, కవిత అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. కొమరయ్య, ఆ ఊరి పొలిమేరల్లో ఉండే గుడి అస్సలు దానికి చేతబడులకు ఏమిటి సంబంధం అన్నది ఈ సినిమా కథ..మా ఊరి పొలిమేర 2 మూవీ టీమ్ ఇప్పటికే సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా డిసెంబర్ తొలి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!