Twitter Logo: మళ్లీ మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంత గూటికి బ్లూ బర్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter Logo: ట్విట్టర్ లోగోను మరో సారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూ బర్డ్ లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌నుట్విట్టర్ లోగోగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మరోసారి దాని స్థానంలో బ్లూ బర్డ్ లోగోని తీసుకొచ్చారు. మూడు రోజుల తర్వాత ఈ లోగో పునరుద్ధరించబడడం గమనార్హం. అయితే పిట్ట సొంతగూటికి చేరినట్లైంది.
Read Also: Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కాగా ఆరంభం నుంచి ట్విట్టర్ లోగో కింద ఉన్న పక్షి లోగోను మార్చి డోజికాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మను ఎందుకు పెట్టినట్టు డోజికాయిన్ అనే క్రిప్టోలో ఎలాన్ మస్క్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని, డోజికాయిన్ విలువను పెంచేందుకే ఇలా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కాగా మస్క్ మూడు రోజుల తర్వాత మళ్లీ పాత పిట్టను తీసుకొచ్చి ట్విట్టర్ లోగోలో పెట్టేశారు. దీంతో కుక్క బొమ్మ కనుమరుగైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతేడాది డోజికాయిన్ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా 258 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ మన్ హటన్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. డోజికాయిన్ ధరను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత పతనానికి కారణమయ్యారన్నది ఇన్వెస్టర్ల ఆరోపణ. సరిగ్గా మూడు రోజుల క్రితం ట్విట్టర్ పిట్టను తొలగించి, దాని స్థానంలో డోజిని కూర్చోబెట్టి ఎలాన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏదో కొన్ని నిమిషాల పాటు అలా జరిగి ఉంటుందేమో అనుకోగా, మూడు రోజుల పాటు డోజికాయిన్ లోగోనే ట్విట్టర్‌లో కొనసాగించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..