ఆనందం అంబరాన్ని అంటుతున్న సమయంలో హద్దులు ఆకాశాన్ని సైతం దాటుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏ మాత్రం అవకాశాలు చిక్కినా వదలొద్దు అంటూ మనసు ఆరాటపడుతుంది. ఇదే పరిస్థితిలో మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఉన్నారు. అసలే ప్రేమవివాహం. ఆపై మిత్రుల సమక్షంలో వివాహానంతర కార్యక్రమం. హద్దులుంటాయా చెప్పండి! మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తమ పోస్ట్ వెడ్డింగ్ లో చేసిన హంగామా ఇప్పుడు వీడియో రూపాన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమ్మాయిగారు మౌనీరాయ్…
బుల్లితెర కథానాయిక, వెండితెరపై ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మౌనీ రాయ్ మొత్తానికీ పెళ్ళిపీటలు ఎక్కేసింది. మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను గోవాలో జనవరి 27న పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం బెంగాలీ, మలయాళ సంప్రదాయంలో జరిగింది. మౌనీరాయ్ ది బెంగాల్ కాగా, దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సూరజ్ ది కేరళ. చిన్నప్పటి నుండే నటన అంటే మక్కువ ఉన్న మౌనీరాయ్… కెరీర్ ను…
సంక్రాంతి పండగపూట కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని…