యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు. ఈ నెల 20 వరకూ దీని చిత్రీకరణ జరుగబోతోంది. జెమినీ టీవీ ఛానెల్…