CJI BR Gavai: శ్రీ మహా విష్ణువుపై భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) బీఆర్ గవాయ్ వ్యాఖ్యల అనంతరం, సోమవారం సుప్రీంకోర్టులో ఆయనపై దాడి జరిగింది. ఓ న్యాయవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సీజేఐ గవాయ్ మంగళవారం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సీజేఐ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం- పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని విచారిస్తుండగా…
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Waqf (Amendment) Act: వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత…
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు సంధించింది. ముస్లింలను హిందూ మత ట్రస్టులలో చేరడానికి అనుమతిస్తారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు.. 'వక్ఫ్ బై యూజర్' చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారు? అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్…
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది.
Supreme Court Hearing On Article 370 Removal: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆలోచనకు 2019 ఫిబ్రవరి నాటి పుల్వామా ఉగ్రదాడి కారణమైందని సొలసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న నాటి ఘటన.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న దేశద్రోహం కేసులపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరుచేసింది. ఈ కేసులకు సంబంధించిన పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…