Mulugu: నేడు ములుగు జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అయితే ఈ నిరసనకు పోటీగా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే నేడు జిల్లాలో మంత్రివర్యుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టివలసిన నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ములుగు జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన చేపడుతున్నారు. ములుగు జిల్లాకు వస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకి ఘట్టం దగ్గర ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు.…