మూఢనమ్మకాలు ప్రజలను ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తాయి. తాజాగా ఈ మూఢనమ్మకం వలన ఒక వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. అయితే ఇప్పటివరకు సన్నిత కడుపు పండలేదు.. ఎన్నో గుడులు, గోపురాలు తిరిగారు అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే బంధువులు వేరొక మహిళా ప్రసవించిన బొడ్డు తాడు తింటే వెంటనే పిల్లలు పుడతారని చెప్పడంతో…