రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జరుగనున్నాయని సమాచారం అందుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక ఇవాళ అర్దరాత్రికి తిరుపతికి చేరుకోనుంది ఆయన పార్దివ దేహం. రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం… తిరుపతిలోని సిరిగిరి అపార్ట్మెంట్ లో డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం… తిరుపతి గోవిందదామంలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. కాగా.. డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఇవాళ వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఇక ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.