తాను చేతులెత్తి జోడిస్తున్నా అని, టీటీడీ గోశాలను ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, టీటీడీపై రాద్ధాంతం మానుకోండన్నారు. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. ఈ…
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భూమనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద భూమనపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్వీ గోశాలలో 100…
అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్టు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యాబై మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్దం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు. ఎస్వీ గోశాలపై కూటమి నేతలు, భూమన…
తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన చెప్పారు. దాంతో తిరుపతి గోశాల…
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. తన కారులో స్వయంగా భూమనను ఎస్వీ గోశాలకు తీసుకోస్తానుని, రావడానికి భూమన సిద్దంగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. అసత్య ప్రచారం నుంచి తప్పించుకోవడానికి ఇంటి దగ్గర, రోడ్డుమీద పడుకుని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. గోవుల విషయంలో భూమన అసత్యాలు చెప్పడం దారుణం అని, హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని బొజ్జల డిమాండ్ చేశారు. ఎస్వీ గోశాలకు…
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి లభించింది. మరికొద్దిసేపట్లో ఆయన గోశాలకు బయల్దేరనున్నారు. ఈరోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారంటూ…
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.