తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టెండర్లు ఫైనల్ చేసినా టీటీడీ నుంచి నిధులను మంజూరు చేయవద్దని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది హైకోర్టు.