తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారు.. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా కొనసాగారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.
టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం..…