ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష…