తన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు అందిస్తున్న సేవలలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.. ఇప్పటి వరకు నగదు చెల్లింపుల ద్వారానే ఆర్టీసీ లావాదేవీలు నిర్వహిస్తుండగా.. క్రమంగా డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.
దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆ�
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికె�
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. స�
ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి�
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందించిన సజ్జనార్ పేరు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్�
తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ మధ్యే టీఎస్ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్‌గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గ�
సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది ప్రభుత్వం… వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. ఆయన వరంగల్ సీపీగా ఉన్న సమయంలో యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల ఎన్కౌంటర్, ఆ తర్వాత సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్లో సజ్జనార్ పేరు మారుమోగింది.. తెల
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయం