ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని,…
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…
కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అనుమతి ఇచ్చిన సర్కార్.. మరోవైపు కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్…