టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ పలు ఆదేశాలు జారీ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తప్పనిసని చేస్తూ చైర్మన్ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట, వరంగల్‌లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ శిక్షణాకేంద్రాల్లో శిక్షణ పొందాలన్నారు. అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లకు తప్పకుండా శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు.
అద్దె బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, అధిక వేగంగా బస్సులు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. యుద్దప్రాతిపదికన అద్దె బస్స డ్రైవర్లు శిక్షణకు హజరవ్వాలని సూచించారు. శిక్షణకు హజరుకాకపోతే జరిమానా విధించడంతో పాటు ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం కూడా రద్దు హెచ్చరించారు.