తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. ఇప్పటికే సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీసీ బాస్ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచేందుకు, ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అదనపు సిబ్బందిని తగ్గించాలని ఆయన నిర్ణయించారు. బస్ భవన్‌లో ఖర్చులు తగ్గించడం, అవసరం లేని సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం చేయాలని నిర్ణయించారు. అదనపు సిబ్బందిని గుర్తించాలని, ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించారు…
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యం తో రూ.100 టికెట్ పై 20 శాతం రాయితీ ప్రకటిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ సజ్జనార్ ప్రకటన చేశారు. నగరంలో 24 గంటల టికెట్ పై ఈ నెల 27 వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని.. ఆర్టీసీ ఓ…
కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఆదేశాలను మీరితే ప్రాసిక్యూషన్…
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీఎస్‌ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సజ్జనార్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం… ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్వయంగా సమస్యలు తెలుసుకోవడం… ఇలా ఒకట్రెండు కాదు.. ఎన్నెన్నో వినూత్న చర్యలను సజ్జనార్ చేపడుతున్నారు. గతంలో పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపించిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం. Read Also: రికార్డుస్థాయికి…
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నుంచి… ఆర్టీసీలో సమూల మార్పులు వచ్చాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాటల్లో దూసుకుపోతుంది. అటు ప్రజలు కూడా ఆర్టీసీ సేవలను ఉప యోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టగలుగుతోంది.తాజాగా ఒక్కరోజే ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని రాబట్టింది. సోమవారం రికార్డు స్థాయిలో 77.06 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది ఆర్టీసీ. గత సంవత్సరం ఆర్టీసీ…
టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ పలు ఆదేశాలు జారీ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తప్పనిసని చేస్తూ చైర్మన్ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట, వరంగల్‌లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ శిక్షణాకేంద్రాల్లో శిక్షణ పొందాలన్నారు. అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లకు తప్పకుండా శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు. అద్దె బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, అధిక వేగంగా బస్సులు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు…
టీఎస్‌ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు ప్రవేశపెడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అయితే తాజా మరో కొత్త కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టించి. ఇక నుంచి పెండ్లిలకు బస్సును బుక్ చేసుకుంటే నూతన వధూవరులకు ఆర్టీసీ తరుపున జ్ఞాపికను అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్క రోజే 500 వివాహాల్లో 500 నవ దంపతులకు ఆర్టీసీ తరుపున షీల్డ్ ను ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానం చేశారు.…
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034…
టీయస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ… యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.…
తెలంగాణలో బస్సు ఛార్జీల మోత మోగనుందా? సామాన్యులపై నిత్యావసరాలకు తోడు బస్సు ఛార్జీలు కూడా భారం కానున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులతో సమావేశం అయింది. ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై సమావేశం అయింది. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొని వివిధ…