అదనపు సిబ్బందిపై ఫోకస్.. సజ్జనార్ నయా స్ట్రాటజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. ఇప్పటికే సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీసీ బాస్ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచేందుకు, ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అదనపు సిబ్బందిని తగ్గించాలని ఆయన నిర్ణయించారు. బస్ భవన్‌లో ఖర్చులు తగ్గించడం, అవసరం లేని సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం చేయాలని నిర్ణయించారు.
అదనపు సిబ్బందిని గుర్తించాలని, ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీని ప్రజలకు దగ్గర చేసేందుకు, ఆక్యుపెన్సీ పెంచేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. దసరా, ఇతర పండుగల సందర్భంగా ప్రయాణికులనుంచి 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయరాదని ఆదేశాలిచ్చారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అధికారులు తమ దగ్గర వున్న దస్త్రాలు, ఆర్థికాంశాలకు సంబంధించినవి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అంతేకాదు ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీతాలు ఎప్పుడు వస్తాయనే పరిస్థితిని మార్చారు. ప్రతి నెలా ఒకటవ తారీఖున జీతాలు అందించే ఏర్పాట్లు చేశారు. కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణించి ఆర్టీసీపై భరోసా కల్పించారు. సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులనుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరించారు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు బస్సులు బుక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్న వారికి పెళ్ళిళ్ళ సందర్భంగా బహుమతులు కూడా ఇచ్చే సంస్కృతిని తెచ్చారు.
బస్ భవన్‌లో ఏ పని కావాలన్నా నాలుగు దశల్లో జరుగుతోంది. ఈ విధానం మార్చి ఒకే గొడుగు కింద వివిధ కార్యకలాపాలు పూర్తిచేయాలని, అదనపు సిబ్బంది ఎంతమంది వున్నారనేది పరిశీలించి వారిని ఇతర విభాగాలకు పంపేలా ఏర్పాట్లుచేయనున్నారు. సూపర్ వైజర్ల వ్యవస్థను ప్రక్షాళించనున్నారు. కొత్తవ్యాపార విధానాలపై సజ్జనార్ ఫోకస్ పెట్టారు. కార్గో ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. అలాంటి తరహాలే ఆదాయ వనరుల్ని పెంపొందించుకోవాలని సజ్జనార్ యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఆదాయం పెంచే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!