నష్టాల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. క్రమంగా పుంజుకుంటోందా..? ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా..?అవుననే అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు..ఆర్టీసీ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందన్నారు ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. రాబోయే మార్చిలోపు తార్నాక ఆసుపత్రిని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు…
తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించాం. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటుచేస్తాం అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అందుకోసం ప్రణాళికలు రూపొందించామని, డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. మార్చి లోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతాం. లేగాటో, డిబీఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారు. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఉద్యోగులంతా…
హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. Read Also: షర్మిల…
దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండగల…
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…