తీగ లాగితే డొంక కదిలినట్లు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతుంది. పేపర్ లీక్‌లో వున్న నిందితులందరినీ విచారిస్తున్న సిట్ కు రోజుకో లింక్ లు బయటకు వస్తున్నాయి. ఇవాల Tspsc పేపర్ లిక్ కేసులో నలుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకోనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు 13 మందిని సిట్ అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ బావ ప్రశాంత్ ను సిట్ అరెస్టు చేశారు. గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రశాంత్ కి వందకు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ విచారణలో వెల్లడి కావడంతో ప్రశాంత్ ను అదుపులో తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు.
Tspsc పేపర్ లీక్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారి ఇది కాస్తా రాజకీయం పులుముకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరగడంతో తీవ్ర దుమారం రేపింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నా అధికారులకు షాక్ కు గురవుతున్నారు. రోజుకో కొత్త మలుపుతో దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు రావడంతో.. అధికారులు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.