TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నా అధికారులకు షాక్ కు గురవుతున్నారు. రోజుకో కొత్త మలుపుతో దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు రావడంతో.. అధికారులు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యమయ్యాయని సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారిందని అన్నారు. రాజశేఖర్, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని అన్నారు. లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించారని వెల్లడించారు. మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారి తెలిపారు. ఏయే పేపర్లు లీక్ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏఈ పరీక్ష పేపర్‌ను ప్రవీణ్ రేణుకకు అమ్మారని, ఇక గ్రూప్ 1 పరీక్ష పేపర్‌పై దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారి తెలిపారు. ప్రవీణ్ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రవీణ్ ఎవరెవరికి పేపర్ ఇచ్చారన్నదానిపై విచారణ చేపట్టామని తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నమాని తెలిపారు.
Read also: Secunderabad: స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 3 లక్షల ఎక్స్ గ్రేషియా..
కాగా.. మార్చి 14న ప్రవీణ్ ను విచారించిన అధికారులకు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించిన పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల న్యూడ్ ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడు ప్రవీణ్ మహిళలపై మక్కువ కలిగిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. 2017లో టీఎస్పీఎస్సీ లో జూనియర్ అసిస్టెంట్గా ప్రవీణ్ చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో ప్రవీణ్ పనిచేశాడు. వెరిఫికేషన్ సెక్షన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకున్న ప్రవీణ్.. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు ఉండమేకాకుండా.. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం పదోన్నతి లభించి టిఎస్పిఎస్సి కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగి బురిటీ కొట్టించాడు. ఆతరువాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రవీణ్ రాసాడు. అయితే.. ఆన్సర్ కీ తో చెక్ చేసుకుంటే 103 మార్క్స్ వచ్చాయని కమిషన్ వర్గాలు అంటున్నారు. కాగా.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ విచారణ లో అంత బయట పడుతుందంటున్న పోలీస్ లు..ప్రవీణ్, రేణుక ఫోన్ లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుండి జరిగిన చాటింగ్ రికవరీ చేశారు. రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు.
Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం