Asifabad: ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. పోస్టుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాలో కటాఫ్‌ను నిర్దేశించారు. ఈ పరీక్షల్లో కొందరు తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు. ఈ వ్యవహారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చితే కుమురం భీం జిల్లాలో కటాఫ్ మార్కులు తక్కువగా ఉన్నాయి. నకిలీ బోనఫైడ్ పత్రాలతో ఇతర జిల్లాలకు చెందిన వారు స్థానికతను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన బోనఫైడ్ సర్టిఫికెట్ తో అభ్యర్థుల జిల్లా స్థానికతను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. కనీసం నాలుగేళ్లు ఒకే చోట చదివినా ఆ జిల్లా వాసిగానే పరిగణిస్తారు. దీనికి తోడు కుమురం భీం జిల్లాలో మూతపడిన పలు ప్రైవేట్ పాఠశాలల పేరుతో కొందరు యువకులు తాము ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివినట్లు నకిలీ బోనఫైడ్ పత్రాలను తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. ఈ విధంగా మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో స్థానికులకు నష్టం వాటిల్లిందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన వ్యక్తి 2018లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఎనిమిదో తరగతి వరకు అదే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో కుమురం భీం జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో తృటిలో ఉద్యోగం కోల్పోయిన పలువురు అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ కటాఫ్ తక్కువగా ఉంటుందని తెలిసి మూతపడిన పాఠశాల పేరుతో నకిలీ సర్టిఫికెట్ తీసుకుని ఉద్యోగం పొందారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులకు నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. కుమురం భీం జిల్లాలో BCD-D కేటగిరీలో సివిల్ పోస్టులకు 122 కటాఫ్ మార్కులు నిర్ణయించబడ్డాయి. మంచిర్యాల జిల్లాలో బీసీ-డీ కేటగిరీకి కటాఫ్ మార్కులు 126 కాగా.. దీంతో ఇతర జిల్లాల వారు ఇక్కడ చదివినట్లు నకిలీ బోనాఫైడ్‌లు తీసుకుని ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. ఈ లొసుగులను ఉపయోగించుకుని చాలా మంది అభ్యర్థులు చాలా సులభంగా ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది.
Raviteja: మా రవన్న కష్టం తెలిసినోడు… యష్ ని అంత తేలిగ్గా తీసిపడేయడు…