ఇటీవల తెలంగాణవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ కీ ని రేపు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. అయితే.. సోమవారం వెబ్‌సైట్‌లో కానిస్టేబుల్ సివిల్, పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్ కీ tslprb.inలో కీని ఉంచనున్నట్లు వెల్లడించింది రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు. అభ్యంతరాలు మే 24 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు సూచించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ఫార్మెట్ ను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫైనల్ కీ సమయంలో ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నట్లు పేర్కొంది.
Also Read : Bengaluru Rains: బెంగళూర్‌లో వర్షాలకు కృష్ణా జిల్లా యువతి మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం
ఫైనల్ కీని విడుదల చేసే సమయంలో ఓఎంఆర్ షీట్లు లాగిన్‌లో ఉంచనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 30న తుది విడుత రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. ఇందులో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు.
Also Read : Dinesh Gope: మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్.. తలపై రూ.30 లక్షల రివార్డ్..