కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి కనకవర్షమే కుసింది.. ఇదే సమయంలో.. వేలంపై ఆరోపణలు కూడా లేకపోలేదు.. గతంలో ఇతర రాష్ట్రాల కంపెనీలు పాల్గొన్నాయి.. ఈసారి ఎందుకు రాలేదంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.. అంతేకాదు.. భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు గుప్పించారు.. దీనిపై సీరియస్‌గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ నగర అభివృద్ధికే కోకాపేట్, ఖానామెట్ భూములు వేలం వేశామన్న సర్కార్.. ప్రభుత్వ భూముల వేలం ఇది కొత్తకాదు.. గతానికి…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం వారి వేతనం నెలకు రూ.15 వేలు ఉండగా.. దానిని రూ.28,719కి పెంచింది నిర్ణయం తీసుకుంది.. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చెల్లించనుంది సర్కార్.. ఇక, ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్…
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా…
ఆ మధ్య వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల పేర్లను మార్చనున్నట్టు ప్రకటించారు.. దానికి అనుగుణంగా.. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. వరంగల్ రూరల్ జిల్లాను హనుమకొండ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. హనుమకొండ జిల్లాలోకి వరంగల్ జిల్లాలోని మండలాలు… వరంగల్ జిల్లాలోని మండలాలు హనుమకొండ జిల్లాలలోకి……
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే…
1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన ఎస్ఎల్‌బీసీ 29వ సమావేశం… బీర్కే భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఒక వారంలో దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని…
గోరేటి వెంకన్న రాసిన గల్లీ చిన్నది పాటను ఎన్నో సందర్భాల్లో గుర్తుచూస్తేనే ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్… వెంకన్న ఆ పాటలోని దళిత బస్తీల్లో కొరవడని సౌకర్యాలను వివరించారు.. మరోసారి ఆ పాటను గుర్తుచేశారు.. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది.. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో…
పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను తిరి ప్రారంభిస్తామని ప్రకటించింది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది.. జులై 1వ తేదీ నుండి 8, 9, 10 తరగతులు ప్రారంభం కానుండగా.. ఉదయం 9.30…
తెలంగాణలో బీఎడ్ కోర్సులో అడ్మిషన్స్ కోసం కొత్త రూల్స్ తెచ్చింది ప్రభుత్వం.. గతంలో ఉన్న నిబంధనలకు సవరణలు చేసి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. ఇక, బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టం చేసింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం కనీస మార్కులుగా నిర్దేశించారు.. బీఎడ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో చేరాలనుకునే వారు డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఏదేని ఒక్క సబ్జెక్టు చదివి…