దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. మొదటగా తాను దత్తతతీసుకున్న వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతటా అమలు చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధులు కూడా విడుదల చేశారు.. అంతే కాకుండా.. మరికొన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే, దళితబంధు పథకం కింద…
వ్యాక్సినేషన్‌లో రాష్ర్టం స్పీడ్ పెంచింది. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అందరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకెళ్తుంది.ఈ నెల 22లోగా కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ను 100శాతం పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలు కలిపి 98శాతం మందికి తొలిడోసు ఇవ్వగా..16 జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 3 జిల్లాల్లో 99 శాతం వ్యాక్సినేషన్, 8 జిల్లాలో90 శాతానికి పైగా, 6 జిల్లాలో 90శాతం లోపు వ్యాక్సినేషన్ జరిగింది.…
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 100 కోట్లకు పైగా జనాభా ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంత సులువు కాదని స్పష్టం చేశారు. ఉపాధి కల్పించే కొత్త సంస్థలకు స్టార్టప్‌లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, నైపుణ్యం ఉంటే ఉద్యోగవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. Read Also: ఇంట్లో కూడా మాస్కు ధరించాల్సిందే: తెలంగాణ…
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జోనల్ విధానం వచ్చినప్పట్టి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు.. ఇక, రేపో మాతో ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు అని నీరక్షిస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ సర్కార్..…
సహజ సంజీవని, కల్పతరువు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి ఇలా ఎన్నో పేర్లు ఉన్న వేప చెట్టు ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉందని.. దానిని కాపాడుకుందామని పిలుపునిచ్చింది తెలంగాణ సర్కార్. వేపచెట్లకు డై బ్యాక్ వ్యాధి సోకి చనిపోతున్నాయని ఈ మేరకు వ్యవసాయ శాఖ తెలిపింది. ఫోమోప్సిస్ అజాడరిక్టే అనే శిలింద్రం సోకడ వల్ల ఇలా జరుగుతోందని వెల్లడించింది. రైతులు, ప్రజలు ఇంటిలో, పంటపొలాల వద్ద ఉన్న వేపచెట్టుకు ఈ వ్యాధి సోకకుండా బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. వేప…
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను…
కేబినెట్ సబ్ కమిటీకి భూముల వివరాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 166 కింద వచ్చిన అప్లికేషన్స్, జీవో నెంబర్ 58 ,59 కింద వచ్చిన దరఖాస్తులు , అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ వక్ఫ్ భూములు, కోర్టు కేసులో ఉన్న భూముల వివరాలను సమర్పించాలని పేర్కొంది. దీంతోపాటు ఆ భూముల విలువ ఎంత అనే వివరాలను కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.హౌస్ సైట్స్ కోసం…
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి అయింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు…
ఫ్రెంచ్ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో టీఎస్ ఐపాస్ గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణను అనుమతిస్తుందని కేటీఆర్ చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి…
తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది… ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై జీడివాగు వద్ద రేగా కాంతారావు కారు బోల్తా పడింది… బైక్‌ని ఓవర్ టెక్ చేయబోయిన సమయంలో.. కారు అదుపుతప్పి చెట్టుకుని ఢీకొట్టింది.. ఆ తర్వాత రోడ్డుకిందకి దూసుకెళ్లి బోల్తా పడింది.. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, ప్రమాదం సమయంలో కారులో రేగా కాంతారావు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.