Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
- ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక
- 10 అణు బాంబ్లకు సరిపడా యురేనీయం నిల్వలు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు శాంతి ఒప్పందం కుదరలేదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ దగ్గర ఉన్న యురేనీయమే. ఈ ఒక్కదాని దగ్గరే శాంతి ఒప్పందం ఆగిపోయింది. ఎన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేసినా.. ఒక్కదాని దగ్గర పంచాయితీ తెగడం లేదు.
తాజాగా ఇరాన్ యురేనీయంపై షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం 10 అణు బాంబ్లకు సరిపడా యురేనీయం నిల్వలు ఉన్నట్లుగా తేలింది. ఇరాన్ దగ్గర సుమారు 970 పౌండ్లకు సమానమైన 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇది సాంకేతికంగా ఆయుధ స్థాయి (90 శాతం) కంటే తక్కువ అయినప్పటికీ.. అణుబాంబు తయారీకి అత్యంత దగ్గరగా ఉన్న స్థాయి అని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ తన “న్యూక్లియర్ పదార్థాన్ని” పూర్తిగా అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం శాంతియుత అణు కార్యక్రమం నిర్వహించేందుకు తమకు హక్కు ఉందని వాదిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇరాన్ దగ్గర ఉన్న ప్రస్తుత యురేనియం నిల్వలను మరింత శుద్ధి చేస్తే కొన్ని రోజులు లేదా వారాల్లోనే ఆయుధ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నిల్వలు సుమారు 10 అణుబాంబులు తయారు చేయడానికి సరిపోతాయని అంచనా వేసింది. ఇరాన్ ఈ యురేనియాన్ని నాటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి ప్రధాన కేంద్రాల్లో సెంట్రిఫ్యూజ్‌ల ద్వారా శుద్ధి చేసినట్లు సమాచారం. అయితే 2025 జూలైలో జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ పరిశీలన నిలిచిపోవడంతో పరిస్థితి మరింత అనిశ్చితంగా మారింది.
ఇక అమెరికా దాడుల తర్వాత ఇస్ఫహాన్ కేంద్రం కింద ఈ యురేనియం పాతిపడిపోయి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. అయితే అది పూర్తిగా ధ్వంసమైందని చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. ట్రంప్.. చర్చలు విఫలమైతే ఈ యురేనియాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా సూచించినట్లు సమాచారం. అయితే నిపుణులు దీన్ని అత్యంత క్లిష్టమైన సైనిక చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికీ ఆ యురేనియం ఎక్కడ ఉందో స్పష్టత లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. అలాగే దాన్ని సురక్షితంగా తరలించడం, పరిశీలించడం కూడా అత్యంత కష్టసాధ్యమైన పని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాల తయారీకి ప్రయత్నించడం లేదని చెబుతోంది. కానీ ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలే అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్య పరిష్కారానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్ నుంచి యురేనియాన్ని పూర్తిగా తరలించడం, మరొకటి దేశంలోనే దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి తగ్గించడం. అమెరికా, రష్యా వంటి దేశాలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల భవిష్యత్తే అమెరికా–ఇరాన్ అణు చర్చల విజయాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది.
అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా చర్చల్లో ఇరాన్ దగ్గర ఉన్న అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ప్రధాన వివాదాస్పద అంశంగా మారాయి. ఈ నిల్వల భవిష్యత్తుపైనే రెండు దేశాల ఒప్పందం విజయమా లేక విఫలమా అన్నది ఆధారపడి ఉందని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
- Tags
- foreign policy
- Iran
- trump
- us
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!