Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..
- మరికొంత సమయం ఇస్తే హార్ముజ్‌ను తెరిపిస్తాం..
- ప్రపంచానికి వెల్లువలా చమురు అందిస్తాం..
- ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు.
‘‘మరికొంత సమయం ఇస్తే, మనం హోర్ముజ్ జలసంధిని సులభంగా తెరవగలం, చమురును స్వాధీనం చేసుకోగలం, మరియు భారీగా లాభపడగలం. ఇది ప్రపంచానికి చమురు ప్రవాహాన్ని ఉప్పెనలా తెస్తుంది’’ అని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోని చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంది. ఈ జలమార్గం గుండా చమురు, గ్యాస్, సరకు రవాణా నౌకల్ని కంట్రోల్ చేస్తోంది.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
మరోవైపు, అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్‌లో పాలనా మార్పు, ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తే, ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మార్గం స్వేచ్ఛా నౌకాయానానికి ఇరాన్ అనుమతించాలని, అప్పుడే కాల్పుల విరమణ ఉంటుందని ఇటీవల ట్రంప్ చెప్పారు. ఈ జలసంధిని ఇరాన్ దిగ్భందిస్తే అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తుందని, పౌర విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, దాడులు చేస్తే ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతాల్లోని యూఎస్ ఆస్తులపై భారీ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..