US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!
- హార్ముజ్ కేంద్రంగా ఇరాన్ యూఎస్ మధ్య చర్చలు..?
- హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణకు యూఎస్ ఓకే..
- యాక్సియోస్ నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్‌లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్‌రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
హార్ముజ్ తిరిగి తెరవడానికి బదులుగా కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒప్పందం గురించి అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. బుధవారం సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు ట్రూత్ సోషల్‌లో కీలక పోస్ట్ పెట్టిన ట్రంప్.. హార్ముజ్ జలసంధి తెరిచి, నౌకాయానాన్ని స్వేచ్చగా అనుమతించినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
Read Also: IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే
‘‘హార్ముజ్ జలసంధి తెరిచి ఉన్నప్పుడే కాల్పుల విరమణ పరిశీలిస్తాము, అప్పటి వరకు మేము ఇరాన్‌ను నాశనం చేస్తాము, రాతియుగానికి పంపుతాము’’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే, చర్చల ప్రక్రియను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధారణమైన నివేదికలుగా తోసిపుచ్చింది. టెహ్రాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోయినా, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని తనకు నమ్మకం కలిగితే, రెండు మూడు వారాల్లో యుద్ధం నుండి వైదొలుగుతామని మంగళవారం అన్నారు.
చర్చల గురించిన వివరాలు తెలిసిన వారు చెబుతున్నదాని ప్రకారం.. ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ మధ్యవర్తులతో మాట్లాడినట్లు చెప్పారు. ట్రంప్ అసహనంగా ఉన్నారని, ఒక వేళ ఇరాన్ డీల్ చేసుకోకపోతే ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతాయనే సందేశాన్ని ఇచ్చారు. కొన్ని డిమాండ్లు నెరవేరితే కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయాల్సిందిగా జేడీ వాన్స్‌ను ట్రంప్ ఆదేశించారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికాతో దౌత్యపరమైన చర్చల్ని తోసిపుచ్చారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం లేదని, అమెరికా చర్యల్లో నిజాయితీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!