శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ "ఎక్కువగా నిరాశ చెందారు" అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది.
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ…
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక…