US vs India: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు తగ్గించిందని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ “ఎక్కువగా నిరాశ చెందారు” అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది. యూరోపియన్ దేశాలు, మా మిత్రదేశాలు కూడా దయచేసి రష్యా చమురు కొనుగోళ్లను ఆపాలని ట్రంప్ ఒత్తిడి చేశారు. ఇందులో భాగంగానే ఈ ఉదయం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చైనా తగ్గిస్తోందని చెప్పుకొచ్చింది. అలాగే, ట్రంప్ అభ్యర్థన మేరకు భారతదేశం కూడా రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేస్తుందని మాకు తెలుసని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ వెల్లడించింది.
Read Also: Bison Review: : ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ డ్రామా బైసన్ రివ్యూ –
అయితే, యూఎస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇక, తన ఇంధన విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుంది. వినియోగదారుల భద్రత ద్వారానే మార్గనిర్దేశం చేయబడుతుందని న్యూ ఢిల్లీ స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఉద్రిక్తతల మధ్య ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.