అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏ దేశం కెళ్లినా ఒకటే ప్రసంగం చేస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు యుద్ధాలు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. భారత్-పాకిస్థాన్ యుద్దంతో పాటు ఆరు యుద్ధాలు ఆపానంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.