నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసీఆర్ ఒక్కరే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీని హెచ్చరించారు. అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అన్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆయన బీజేపీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిచెప్పారు.
అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అంటూ అధికారులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు అధికార పార్టీ ఎమ్మెల్యే… కొమురం భీం జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది… జిల్లా పరిషత్ సమావేశంలో ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప… కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్ నగర్ వెళ్లే రోడ్డుపై ఎందుకు అలసత్వం చేస్తున్నారని ప్రశ్నించారు..…
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఆ.. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6గంటలకే వెళ్లి అక్కడ వున్నారు. పోలీస్ అధికారి ముందే వెళ్లి వచ్చారు. ముందే రికార్డు చేసి పెట్టుకున్నారు. స్వామిని కూడా వదిలిపెట్టరా? ఎందుకు ముఖ్యమంత్రికి హిందువులంటే అంత కోపం అంటూ ఆరోపించారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇంతకీ రోహిత్ రెడ్డి చేసిన…
ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌కు ప్రయత్నించడం.. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం పెద్ద రచ్చగా మారింది.. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.. డీల్ సమయంలో.. ఢిల్లీలోని పెద్దలతోనూ మాట్లాడించే…