దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెట్రో ల్, డీజిల్ ధరల పెరుగుదలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పాటించడానికి బలముండాలన్నారు.
పెట్రోల్‌పై రూ.41 పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10 తగ్గించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఉప ఎన్ని కలు వస్తేనే టీఆర్‌ఎస్ నాయకులకు జోష్ వస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్ నాయకులకు లేదని రాజాసింగ్ అన్నారు.