సిద్ధిపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో , గ్లోబల్ సైన్స్ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు, జిల్లాలోని, 100 పాఠశాలలకు, సైంటిఫిక్, మూవింగ్, గ్లోబులతో పాటు ఇతర పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధి పేట పట్టణాన్ని, విద్యానిలయం గా తీర్చిదిద్దా మన్నారు.
మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఏ జిల్లాలో సీటు వచ్చినా, సిద్ధిపేటలో సీటు రావా లి అన్నది వాళ్ళ కోరికగా ఉండటం తల్లిదండ్రులు నాపై నమ్మకం ఉంచి ఇక్కడ చదివించడం గర్వకారణంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, కొత్త భవనాలు, అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యా శాఖకు నాలుగు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటిం చారు. సిద్ధిపేట పట్టణంలో, 4 పాలిటెక్నిక్ కాలేజీలు, 2, మెడికల్ కాలేజీలు ఉన్నాయని సిద్ధిపేట విద్యహబ్‌గా మారబోతుందన్నారు. అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుకు తీసుకెళ్తున్నట్టు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.