కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి…
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఛాన్స్ ఎవరికి దక్కనుంది..? అధికారపార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? గవర్నర్ కోటాలో ఆయన వస్తే .. అధిష్ఠానం అటు మొగ్గు చూపుతుందా? కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఆధారంగానే ఛైర్మన్ ఎంపిక ఉంటుందా? ముగ్గురు చుట్టూ మండలి ఛైర్మన్ పీఠంపై చర్చ..! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. శాసనమండలి ఛైర్మన్ ఎవరు అనే దానిపై అధికారపార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మరోసారి…
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత సహా టీఆర్‌ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్‌ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ…
నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు,…
గత పది రోజుల నుంచి ధాన్యం కోనుగోలు అంశంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం… కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం తీరుకు నిరసనగా.. ఇవాళ ఇందిరా పార్క్ లో టీఆర్‌ఎస్ మహా ధర్నా చేస్తోంది. అయితే…ఈ మహా ధర్నాలో ఓ అరుదైన సంఘటన చోటు…
ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో…
బీజేపీపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీజేపీ .. బద్మాష్ పార్టీ అని… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన పంటను ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల లో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తెలంగాణ ధాన్యం…
మొన్నటి వరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ చాలా…