ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా…
గత కొన్ని రోజులుగా వరి కొనుగోలు ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెల్సిం దే. అయితే దీనిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు దూషణలతో ఎలాంటి ఉపయోగం ఉండదని రైతుల సమస్యలన పరిష్కరించే విధంగా ఇరు ప్రభుత్వాలు మాట్లాడు కోవాలన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోవడం…
ధర్మపురి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం హర్షణీయం. రైతుల నడ్డి విరుస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ఆప్పగించేలా కేంద్రప్రభుత్వం చర్యలను సంవత్సరం క్రితమే టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి చట్టాలను వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించినప్పుడు వాటి ఫలితాలు,నష్టప్రభావం అంచనా వేయకుండా అత్యంత దారుణంగా వ్యవహిరించింది. ధీంతో 600 మంది రైతులు ప్రాణాలు వదిలారు. సంవత్సరంన్నర నుండి ఆయా…
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు…
వడ్లకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఇప్పటికే రైతులు కల్లాల వద్ద వడ్లను పోసి ఉంచినా కొనుగోలు కేంద్రాలు సరిపడినన్ని లేవని సీపీఐరాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రం రైతు చట్టాలను ఉప సంహారించుకోవడం సదుద్దేశమైనప్పటికీ, దీని వెను రాజకీయ కార ణాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై రైతు లు గత సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం…
టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి? రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు? అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు.…
ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్టీల ఇష్టం. బలం లేనిచోట పోటీకి ఆలోచనలో పడతాయి. ఏకగ్రీవంగా గెలిచే పార్టీలో సంబరాలే సంబరాలు. కానీ.. అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న సంబరాలు వేరే ఉన్నాయట. ఎవరో ఒకర్ని పోటీకి పెడితే.. తమ పంట పండుతుందని ప్రత్యర్థి పార్టీలను వేడుకుంటున్నారట. ఎందుకో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోరుకుంటున్నారా? తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్‌లీ. ఏ చిన్నపాటి ఎన్నిక వచ్చినా డబ్బులు…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూదనా చారిని ఫైనల్ చేసింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది కేబినేట్. ఇక తెలంగాణ కేబినేట్ పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టడమే తరువాయి. ఇవాళ మధ్యాహ్నం లోపు తెలంగాణ…
MLC పదవి పేరు చెబితే ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారా? తమ నియోజకవర్గాల్లో ఎవరికీ ఆ పదవి ఇవ్వొద్దని ఓ రేంజ్‌లో మంతనాలు సాగిస్తున్నారా? ఎమ్మెల్సీ పదవంటే ఎందుకు హడలిపోతున్నారు? ఏంటా జిల్లా? తమ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా ఎమ్మెల్యేల ఎత్తుగడ..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పది. అన్నిచోట్లా ప్రస్తుతం ఒక్కటే చర్చ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నిక గురించే హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. స్థానిక…