ఒక్కసారి కాదు వందసార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తా : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని, కేసీఆర్ కి ఒక్కసారి కాదు వందసార్లు పాదాభివందనం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ నాకు దేవుడుతో సమానం. తెలంగాణ ప్రజలకు తండ్రి సమానులు. నా పొలిటికల్ ఎంట్రీ పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. అందరూ ముఖ్యమంత్రుల వద్ద పని చేశానంటే వాళ్ళు నన్ను, నా పని తనాన్ని మెచ్చుకుని పదవులు ఇచ్చారు.
Also Read
అందరు ముఖ్యమంత్రుల మన్ననలు పొందానంటే నేనేంటో తెలుసుకోవాలి. కేసీఆర్ పని విధానానికి ఆకర్షితుడినై టీఆర్ఎస్ లో చేరాను. కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా. కలెక్టర్ పదవి వదిలి పెట్టి రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత రైతుల పక్షాన ఉద్యమం చేయడం సంతోషంగా ఉంది’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!