గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూదనా చారిని ఫైనల్ చేసింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది కేబినేట్. ఇక తెలంగాణ కేబినేట్ పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టడమే తరువాయి.
ఇవాళ మధ్యాహ్నం లోపు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ఈ ఫైల్ పై సంతకం పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్ పెట్టడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూదనా చారిని ఫైనల్ చేసింది తెలంగాణ సర్కార్. కాగా… గతంలో అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనా చారి పని చేసిన సంగతి తెలిసిందే.