వడ్లకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఇప్పటికే రైతులు కల్లాల వద్ద వడ్లను పోసి ఉంచినా కొనుగోలు కేంద్రాలు సరిపడినన్ని లేవని సీపీఐరాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రం రైతు చట్టాలను ఉప సంహారించుకోవడం సదుద్దేశమైనప్పటికీ, దీని వెను రాజకీయ కార ణాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై రైతు లు గత సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం చేశారని వారికి ధన్యవాదాలని ఆయన అన్నారు. రాష్ర్టంలో కేసీఆర్ రైతులపై అను సరిస్తున్న విధానాలు సరైనవి కావాన్నారు. ఒకప్పుడు పంట మొత్తం కొంటానని చెప్పి ఇప్పుడు కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఓ సలహా ఇస్తున్నామని రైతులను మోసం చేయోద్దని ఆయన హితవు పలికారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని, అకాల వర్షాల కార ణంగా ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అధికార యంత్రాంగం అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టేలా వ్యవహరించాలని చాడ వెంకట్ రెడ్డి కేసీ ఆర్ సర్కార్‌కు సూచించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం మా ని రైతులను పట్టించుకోవాలని ఆయన చెప్పారు. మిల్లర్లతో ఉన్న సమస్యలు పరిష్కరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకో బోమన్నారు. రైతుల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని వెల్లడిం చారు. రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చిందని ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు.