సీఎం కేసీఆర్‌పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు అంటూ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే అని అన్నారు. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలన్నారు.…
సీఎం కేసీఆర్ ఈ రోజు వనపర్తి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని, బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదివేలో, 20 వేలో…
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా…
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్..…
బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు.. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా ఏమీ జరగదని స్పష్టం చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి… సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో సస్పెన్షన్ గురైన బీజేపీ శాసనసభ్యులు న్యాయపోరాటం చేస్తామనడంపై మండిపడ్డారు.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించిన ఆయన.. ప్రజరంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. Read Also: Roja Vs Atchannaidu: రోజాకు ఛాలెంజ్.. ఆమె గెలిస్తే…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందే అనుకొని నల్ల కండువాలతో అరిచారని, స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ…
మహిళల భద్రత, స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే నిజమైన మహిళా సాధికారత అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అందుకే అన్ని పథకాల కింద కుటుంబాల్లోని మహిళ పేరు మీద అధికశాతం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల భద్రత…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన…
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో విపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త జోష్‌తో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా రేవంత్…
సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు.…