బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు.. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా ఏమీ జరగదని స్పష్టం చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి… సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో సస్పెన్షన్ గురైన బీజేపీ శాసనసభ్యులు న్యాయపోరాటం చేస్తామనడంపై మండిపడ్డారు.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించిన ఆయన.. ప్రజరంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు.
Read Also: Roja Vs Atchannaidu: రోజాకు ఛాలెంజ్.. ఆమె గెలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేయం..
ప్రజా సమస్యలను ప్రతిభింభించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం లేదన్నారు.. సభలో నిలబడి మాట్లాడే ధైర్యంలేక సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్న ఆయన.. సభను సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారని తెలిపారు.. బీఏసీ తీర్మానాలను ఉల్లంఘించి బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకొచ్చారన్న ఆయన.. సభను అడ్డుకుంటామనే బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు.. ప్రతి ఒక సభ్యుడు సభ మర్యాదలకు అనుగుణంగా నడుచుకోవాలి.. కోర్టుకు వెళ్లినంత మాత్రాన ఎమీ జరగదన్నారు.. కేంద్రం చేస్తున్నసహాయ నిరాకరణను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని తెలిపారు మంత్రి జగదీష్‌రెడ్డి.