కేసీఆర్ రాజు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గడీల నుంచి బయటకు రాడని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శించాడు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని.. నమోదైన వాటిలో 50 శాతం తప్పులే ఉన్నాయని అన్నారు. . ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్నాడని.. సీఎంది నోరా మోరా అని విమర్శించారు.…
సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం తొలగిపోయేరోజు దగ్గరలోనే ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. కానీ కేసీఆర్ తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారని.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఈటల అన్నారు. కేసీఆర్ తరహాలో తాను సంస్కారం లేకుండా మాట్లాడనని…
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక…
సీఎం కేసీఆర్ పై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీ ప్రభుత్వం, నీ విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. మేము కూడా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు సవాల్ విసిరారు లక్ష్మణ్. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఠాయికి మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీ సీఎం యోగి గురించి మాట్లాడారని.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తు చేశారు. యోగీ వేసుకున్న బట్టల గురించి లుంగీ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పెత్తనం లేకుండా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం జీవిస్తున్నారని.. కానీ మీరు మీ కుటుంబం వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం, అహంకారం కోసం పాలిస్తున్నారని విమర్శించారు.…
దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు.…
దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్…
ఇవాళ మీడియాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మేకిన్ ఇండియా పథకం అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటున్నారు. పాకిస్థాన్ మనకు అసలు సమస్యే కాదు. అది స్మాల్ ప్రాబ్లం. చైనాతోనే మనకు ముప్పు పొంచి ఉంది. స్విస్ బ్యాంకులోని డబ్బులను వెనక్కి తెస్తామన్నారు. కానీ అక్కడ డిపాజిట్లు డబుల్ అయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. ఢిల్లీలో మాటలు చెప్పే ఇంజన్ వద్దు. పనిచేసే ఇంజన్…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ మీటింగులో.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ సాధించింది ఏమీలేదని విమర్శించారు. తాను అడిగిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని తప్పుపట్టారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు వాళ్లు చేసిందేమీ లేదని, వాళ్ల దగ్గర సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ 80కి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.…