అధికారపార్టీలో ఎమ్మెల్యేల జోడు పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వరసగా ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టడంతో.. ఇతరులకు లైన్ క్లియరైనట్టేనా? ఆశలు వదిలేసుకున్నవారు మళ్లీ హుషారుగా ఎదురు చూస్తున్నారా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్యేలలో పదవులపై ఆశలు టీఆర్ఎస్‌లో కొంత కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవుల పొందిన వారిలో కొందరికి రెన్యువల్ అయితే.. కొత్త వాళ్లలో మరికొందరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్…