కరోనా వైరస్ మహమ్మారి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కలెక్టర్లు… మీ పరిధిలో ఉన్నవి మీరు చేయండి. లేనివి మా దృష్టికి తెస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. మీ కృషికి మేము అండగా నిలవాలన్నదే మా తాపత్రయం. ప్రైవేట్ హాస్పిటల్ లో చేరుకున్నది కూడా మన ప్రజలే కాబట్టి వారికి ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంటే…
మరికొన్ని నెలల్లో వరంగల్‌లో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 65వ డివిజన్ తెరాస అభ్యర్థి గగులోతు దివ్య తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు.…
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ…
రాష్ట్రంలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదు అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మన దగ్గర పేషేంట్లకు సరిపడా బెడ్స్ ఉన్నాయి, టీకాలు, మందులు ఉన్నాయి అని చెప్పిన ఆయన చికిత్స కు ముందుగా వచ్చిన వారు బతుకుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఆక్సిజన్ కొరత లేదు. 80 టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తున్నాం. ఏ కొంచెం లక్షణాలు ఉన్నా డాక్టర్స్ ని కలవాలి. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ వస్తోంది. టెస్టుల ఫలితాలు…
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి…