రాష్ట్రంలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదు అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మన దగ్గర పేషేంట్లకు సరిపడా బెడ్స్ ఉన్నాయి, టీకాలు, మందులు ఉన్నాయి అని చెప్పిన ఆయన చికిత్స కు ముందుగా వచ్చిన వారు బతుకుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఆక్సిజన్ కొరత లేదు. 80 టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తున్నాం. ఏ కొంచెం లక్షణాలు ఉన్నా డాక్టర్స్ ని కలవాలి. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ వస్తోంది. టెస్టుల ఫలితాలు వచ్చే వరకు అగొద్దు. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయి అని అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భరోగా నమోదవుతున్నా విషయం తెలిసిందే.