కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సభలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగ పుత్రుల ఏకగ్రీవ తీర్మాణం చేసారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 25,116 అందజేశారు గంగ…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర అని చెప్పి… ప్రజలను మోసం చేసే యాత్రకు శ్రీకారం చుట్టారు అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని యాత్రలో చెప్పి ఉంటే బాగుండేది. మోదీ పాలనలో ఈ దేశంకు ఏం చేశారు… 5 కోట్ల మందికి జాబ్ లు ఇస్తామన్నారు …ఏమైనది అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ అని…
హుజూరాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నేతలు, ఇంచార్జులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్ధేశం చేశారు. తాజాగా అక్కడి నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతూ… వెక్కిరించిన పనులే వెలుగునిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, కాళేశ్వరం తరహాలోనే దళితబంధు అమలుకూడా జరుగుతుంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లేవు. ఉద్యోగాలు ఊడగొట్టడమే ఆ పార్టీకి తెలుసు. 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్. బీజేపీ దొంగ నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు అని తెలిపారు. భారీ మెజార్టీతో…
మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు.…
గతం లో సాగు నీటి కోసం,కరెంట్ కోసం రాష్ట్రం లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ నేడు కేసీఆర్ ప్రభుత్వం లో అటువంటి సమస్యలు లేవు. 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నెలకు 12 లక్షల రూపాయలను రైతుల పేరు మీద ఎలక్ట్రిసిటీ కి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంక్ ల నుండి అప్పు తీసుకుని రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రతి పంటను కొనుగోలు…
సమైక్య రాష్ట్రంలో ఆరోజు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తది అని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర…
నాగోల్ లోని ఫతుల్లాగూడాలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్దాల రీ-సైకలింగ్ ప్లాంట్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్తా ఉత్పత్తి అవుతుంది. అందుకే గతంలో ఉన్న 70 చెత్తా కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ను 100 కు పెంచుతున్నాం. ఇంకా చెత్తను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశాం. మనం గ్రేటర్…
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 62 ఎకరాల్లో 325 పడకల ఆస్పత్రి కొనసాగుతుంది అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 1200 బెడ్స్ తో వెయ్యి కోట్లతో ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉంది. 5 వేల కోట్లతో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నాలుగు గేట్లు ఉండేలా… పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఎమ్మెల్యే మాగంటి.…
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి.…