యాదాద్రికి 6 కిలోల బంగారం విరాళం ఇవ్వనున్న టీఆర్‌ఎస్ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు ఒక్కొక్కరు కిలో బంగారాన్ని యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
నిన్ననే సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా యాదాద్రి ఆలయం ప్రత్యేకత సంతరించుకునేలా శిలానైపుణ్యాలతో ఆలయ నిర్మాణం కళ్లు చమక్కుమనేలా తీర్చిదిద్దినట్లు ఇప్పటికే తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!