మేడమ్ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. మేయర్‌పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..! గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ..…